![]() |
![]() |

జెమినీ టీవీలో ప్రసారమవుతున్న "అను అనే నేను" సీరియల్ లో హీరో ఆకాష్ మెయిన్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు ఆకాష్ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు. డాక్టర్ వెంకటేష్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఆకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2001లో వచ్చిన ‘ఆనందం’ మూవీ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం అయ్యారు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది.
ఈ చిత్రంతో హీరో ఆకాష్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. రేఖ హీరోయిన్‌గా నటించింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ‘ఆనందం’ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఐతే ఇప్పుడు ఈ అను అనే నేను సీరియల్ నుంచి ఆకాష్ తప్పుకోవడం పై ఒక వీడియోని రిలీజ్ చేశారు. "అను అనే నేను సీరియల్ లో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన జెమినీ టీవీకి ధన్యవాదాలు.
కానీ, నేను పోషించిన హీరో పాత్రలో పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్ లేకపోవడమే కాకుండా ఈ రోల్ లో నటించడానికి పెద్దా ఆసక్తి కూడా ఉండడం లేదు. అందుకే సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ టీమ్ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మరి ఆకాష్ ప్లేస్ ఎవరిని రీప్లేస్ చేస్తారో చూడాలి. ఆనందం తర్వాత ఆకాష్ తెలుగు, తమిళ భాషల్లో 50పైగా సినిమాల్లో నటించారు. ‘అందాల రాముడు’, ‘నవ వసంతం’, ‘గోరింటాకు’, ‘నమో వెంకటేశ’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు ఆకాష్. హీరోగా, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయన ఫెయిల్ అయ్యారు.
![]() |
![]() |